ప్రధాన కార్యదర్శిగా దరిపెల్లి ప్రవీణ్ కుమార్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్ష కార్యదర్శులను జిల్లా కేంద్రంలోని కృషి ఐటిఐ ఆవరణలో ఆదివారం కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం ఆధ్వర్యంలో వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఓరుగంటి గోపాల్, ప్రధాన కార్యదర్శిగా దరిపెల్లి ప్రవీణ్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. జిల్లాలోని కుమ్మరుల సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ పరిష్కరించే విధంగా తమ కర్తవ్యం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర కమిటీ సూచనల ప్రకారం కార్యచరణ చేపడతామన్నారు. కుమ్మరులను బీసి బి నుండి బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. కుమ్మరులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందితేనే తమ హక్కులను సాధించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల కుమ్మరి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులుగా ఓరుగంటి గోపాల్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES