Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒటీఆర్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

ఒటీఆర్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

- Advertisement -

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఒటీఆర్‌) అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువు ఫిబ్రవరి 25 వరకు పొడిగించినట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు సోమవారం కమిషన్‌ చైర్మెన్‌ బుర్రా వెంకటేశం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్య, సామాజిక ఇతర వివరాల ను సరి చేసుకునేందుకు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు అవకాశమిచ్చా రు. కమిషన్‌ వద్ద 31.56 లక్షల మంది నమోదు చేసుకుని ఉన్నారు. అభ్యర్థు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పాలిసెట్‌ -2026 నోటిఫికేషన్‌ విడుదల
పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌)-2026 నోటిఫికేషన్‌ ను సాంకేతిక శిక్షణ, విద్యామండలి సోమవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 22 వరకు దరకాస్తు చేసుకోవచ్చు. మే 13న పాలిసెట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను విడుదల చేస్తారు. మరిన్ని వివరాలకు 080314 04549లో సంప్రదించాలని మండలి ఒక ప్రకటనలో సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -