- Advertisement -
– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకోలేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ఈ కాలంలో కేసీఆర్ ఓయూను తీవ్ర నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓయూను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 108 ఏండ్ల ఓయూ అభివృద్ధిపై సీఎం తీసుకున్న నిర్ణయంతో బలమైన పునాది పడిందని తెలిపారు.
- Advertisement -