Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా మన అభ్యర్థులు ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా మన అభ్యర్థులు ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అన్నారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమే అన్నారు. రెబల్స్ విషయంలో మాట్లాడి స్వయంగా సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -