Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల ఆస్తి కాపాడటమే మా కర్తవ్యం: సీఐ సంతోష్

ప్రజల ఆస్తి కాపాడటమే మా కర్తవ్యం: సీఐ సంతోష్

- Advertisement -

 నవతెలంగాణ – ఆత్మకూరు
ప్రజల ఆస్తి కాపాడటమే తమ కర్తవ్యమని స్థానిక సిఐ ఆర్ సంతోష్ అన్నారు. వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశానుసారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆదివారం ప్రజల ఆస్తి దోపిడీలకు గుర కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సందిగ్ధ వ్యక్తులను వెంటనే సమాచారం ఇవ్వమని పోలీస్ శాఖ జారి చేసిన అవగాహన పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. “మా ప్రధాన లక్ష్యం గ్రామస్తుల ఆస్తులను రక్షించడం. అందరికీ తమ ఆస్తిపై జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి” అని తెలిపారు. గ్రామాల్లో పోలీస్ అధికారి, వలంటీర్ల తో సహకారంతో అస్తి చోరీ కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ పోలీస్ సిబ్బంది వాలంటిర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -