ఓ యుద్ధ విమానాన్ని కూల్చేసింది
ఒక్క దానికీ నష్టం జరగలేదు
ప్రకటించిన చైనా ప్రభుత్వ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ విభాగం
బీజింగ్ : పాకిస్తాన్‌కు తాను ఎగుమతి చేసిన ఫైటర్ జెట్ విమానాలు గత సంవత్సరం మేలో యుద్ధ విజయాన్ని సాధించాయని, ఒక్క దానికీ నష్టం జరగలేదని చైనా అధికారికంగా తెలియజేసింది.
తమ జెట్ ఫైటర్ జే-10సీఈ ఓ యుద్ధ విమానాన్ని కూల్చేసిందని ఈ నెల 9న చైనా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ విభాగం తెలిపింది. కానీ ఏ యుద్ధంలో ఇది జరిగిందో వివరించలేదు. అయితే ప్రభుత్వ వార్తా సంస్థ సిన్హువా ఈ నెల 12న ఇచ్చిన నివేదిక ప్రకారం ‘జే-10సీఈ ఫైటర్ అనేక శత్రు యుద్ధ విమానాలను కూల్చేసింది. ఈ జెట్ ఫైటర్ ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. ఇందులో ఒకే ఇంజిన్, ఒకే సీటు ఉంటాయి.
ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది’. కాగా చైనా సరఫరా చేసిన జే-10సీఈ ఫైటర్లను పాకిస్తాన్ ఉపయోగిస్తోందని పెంటగాన్ నివేదిక తెలియజేసింది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే చైనా వీటిని విక్రయిస్తోంది. 2020 నుంచి 36 ఫైటర్లను చైనా సరఫరా చేసింది. తన ఫైటర్ జెట్లు ఎక్కడ విజయం సాధించిందీ చైనా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ గత మేలో భారత్‌తో జరిగిన ఘర్షణల సమయంలో వాటిని పాకిస్తాన్ ఉపయోగించినట్టు అర్థమవుతోంది. అయితే పాక్‌తో జరిగిన ఘర్షణలో తనకు ఎలాంటి నష్టం జరగలేదని భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మా జెట్ ఫైటర్ విజయం సాధించింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



