పోయినద్వారం హంసరాజ్ సారు అర్సేతుల్లా ఎక్కడ నొక్కుతే ఏం లాభామో సూయిస్తానప్నాపుడు ఆ ఒక్కప్ దాపీనికి అంతదూరం నుండి అస్తదనుకున్న కాని ఆ ఒక్క దాంకి రాలే తను వస్థు యబారు పోస్తాకాలు తీస్కొస్తుండు, రాసేతోళ్లకు, సద్వేటోళ్లు ఉండాలే.
లక్సనచరి, సాంబమూర్తి, కంలారెడ్డి, గిళ్లంతా రచెత్తలనట్టు.
జగదీష్ కు జవ్హార్లల పాట నేర్పించిండ్రు కడ,మాక్ కూడా మ్ అన్న నేర్పియమని అనూష,శివలీల అడిగింద్రంతా, దంచుకుంటా పడేదాని రాసించింది, పట్నాళ్ల మిక్సీలు, గైందర్లు పఫైతాయి రోళ్ళు కారాకున్నాయి, కల్ని మనకాలితే ఉన్నారుగా, అని అనుకొని రోళ్ళు తెచ్చిపెట్టి గిన్ని పాస్పు కమ్మలేసిన.
నయినమ్మ చిన్నమ్మ వస్తానే గి రోళ్ళు ఇదేందుకు పెట్టినవ్ గి పాస్పు కొమ్మలు లేంది అని ఆగ వట్టిండ్రు గిల్లు కూడా సప్రైస్ ఇస్తామన్నారు ఎం జేయాలె నాల్గు పాస్పుకొమ్మలు మిగిల్నాయని దంచుదామని పెట్టినలే అని మాట మార్సేసిన.
ముందుగాల అయితే ధ్యానం సెయ్యింద్రీ నేను ఇంకా సిరికి దంచుకుంటా, ద్యానానికి కండ్లు మూసుకొని 5,6 నింసాలు కంగానే శివ లీల అనూష, గమ్మునొచ్చి రొకళ్ళు పట్కొని ఇందిరమ్మ, జన్మదిన, అభినదానమ్మా, ఇంధీరాంతి సుందారులు ఏందారమ్మ అని పడంగానే ధ్యానంల ఉండోళ్లు ఒక్క సరి ఉలికి పడ్డారు, నవ్వు కుంటా పడుండ్రి పాడుండ్రి అని మెచ్చిండ్రు.
గిల్లు మాట్లాడ్తూనే ఉన్నారు, శమంతా జాన్సీ రాని లెక్క వొచింది, చేతున నేను ముత్తాతోని డాలు చేసించిన, కత్తి వాళ్ళ నయినా తన తెచ్చుకుంది, కుడి సేతుల ఎడం సేతుల పట్కొని ఒరి దాల్వాయిసి మాకు దాథ అధికారం లేదా మాకు పిల్ల లేకుంటే నువ్వ వారసుడివి ని కుట్నీ బుద్దులు మాదగ్గర చెల్లవ్ అనుకుంటా ఒక్కసారి చెంగునెగిరింది.
నాకైతే గుండె జల్లుమన్నది. పిల్లలకి నేర్పియాలేగాని మస్తు ట్యాలెంటు బయటపడ్తున్నాయి.
- గంగరాజ పద్మజ, 9247751121



