నవతెలంగాణ – హైదరాబాద్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (124) అద్భుత శతకంతో పోరాడినా ఫలితం దక్కలేదు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తమ ప్రదర్శన నిరాశపరిచిందని అంగీకరించాడు. “మేం ఆడిన తీరు తీవ్ర నిరాశ కలిగించింది. కొన్ని అంశాలపై దృష్టి పెట్టి, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్ అద్భుతంగా ఉందని, యువ ఆటగాళ్లు నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా రాణించారని ప్రశంసించాడు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నితీశ్ రెడ్డి లాంటి యువకులకు మరిన్ని అవకాశాలు ఇస్తామని గిల్ స్పష్టం చేశాడు.
మా ప్రదర్శన నిరాశపరిచింది: శుభ్‌మన్ గిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



