Tuesday, January 13, 2026
E-PAPER
Homeజాతీయంమన బంధం మానవాళికి ముఖ్యం

మన బంధం మానవాళికి ముఖ్యం

- Advertisement -

జర్మన్‌ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ప్రారంభించాలి
ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోడీ
జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో కలిసి కైట్‌ ఫెస్టివల్‌ షురూ


సబర్మతి: భారత్‌- జర్మనీ ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం మానవాళికి ముఖ్యమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. జర్మన్‌ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రష్యా- ఉక్రెయిన్‌, గాజా సహా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించి నట్టు తెలిపారు. ఆసియా పర్యటనలో భాగంగా మొదటగా భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో సమావేశమైన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా రంగంలోనూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచేందుకు రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందులో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, విదేశాంక కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాల్గొన్నారు. వాణిజ్యం సహా పెట్టుబడులు, శాస్త్ర, సాంకేతికం, విద్య, నైపుణ్యం, రక్షణ, భద్రత, పరిశోధన రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చించారు.

కైట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ప్రధాని
అంతకుముందు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో కలిసి ఆయన గాలిపటం ఎగురవేశారు. ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. మెర్జ్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ప్రధాని మోడీ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -