Sunday, August 3, 2025
E-PAPER
Homeసినిమామన తెలుగు సినిమా మరోసారి మెరిసింది

మన తెలుగు సినిమా మరోసారి మెరిసింది

- Advertisement -

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 7 అవార్డులను సొంతం చేసుకుని మన తెలుగు సినిమా మరోసారి మెరిసింది అని అగ్రనటుడు చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ, విజేతలకు అభినందనలు తెలిపారు.
71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరీ’ జాతీయ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికవ్వగా, ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ, ఉత్తమ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ‘హనుమాన్‌’ చిత్రం రెండు పురస్కారాలను దక్కించుకుంది. అలాగే ‘బేబి’ సినిమాకి సంబంధించి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా దర్శకుడు సాయి రాజేష్‌, ‘ప్రేమిస్తున్నా’ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ అవార్డులకు ఎంపికయ్యారు. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్‌, ఉత్తమ బాలనటిగా సుకృతివేణి (గాంధీతాత చెట్టు) ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
‘భగవంత్‌ కేసరి’కి ఉత్తమ తెలుగు చిత్రంగా దక్కిన జాతీయ గౌరవం మొత్తం చిత్ర బృందానికే దక్కుతుంది. నాకెంతో గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్ని తాకే శక్తిమంతమైన కథల్ని అందించాలన్న మా తపనని మరింత బలపరుస్తోంది. ఈ కథని అద్భు తంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు సాహు గార పాటి, హరీశ్‌పెద్ది, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది కృషితోనే మాకు ఈ విజయం సాధ్యమైంది’ అని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -