నవతెలంగాణ – ఆర్మూర్
మన ఊరు మన భద్రత ప్రతి ఒక్కరిది అని జిల్లా సీపీ సాయి చైతన్య అన్నారు. గురువారం పట్టణంలోని పెరికిటు మీనాక్షి కన్వెన్షన్ యందు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు ప్రథమ పౌరులు అని, మన ఊరు మన భద్రత మన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత గ్రామాల సర్పంచ్ చేతుల్లో ఉంటుందని ఉన్నారు. గ్రామ ప్రగతికి రోడ్డు భద్రత అత్యవసరమని ప్రజలకు అవగాహన కల్పించడం గ్రామ సర్పంచిగా చైతన్యం కల్పించాలని కోరినారు. కులమత పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సర్పంచులు భాగస్వాములను కావాలని కోరినారు. ఆర్మూర్ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని, సినీ నటుల పిల్లలు కోట శ్రీనివాసరావు కొడుకు, బాబు మోహన్ కొడుకు సైతం రోడ్డు ప్రమాదంలోని చనిపోయినారని గుర్తు చేశారు.
రోడ్లపై ధ్యానం రాశులు ఆరబోయడంతో ఎంతోమందికి చనిపోతున్నారని అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని సూచించారు. నేడు యువత డ్రగ్స్, ఐపీఎల్ బెట్టింగ్, బానిసలవుతున్నారని అన్నారు. ఆన్లైన్ బెట్టింగు అలవాటు పడ్డవారు అనేక మోసాలకు గురవుతున్నారని అన్నారు. బాల్కొండ లో ఏటీఎం దొంగతనం ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ సందర్భంగా సామాజిక శివ కార్యక్రమాలు చేసిన ఆర్మూర్ గాంధీ, తులసిపట్వారి లను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వా రెడ్డి , ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సీఐ జాన్ రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు , సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ కాంతి గంగారెడ్డి , శ్రీ భాషిత సుందర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనె ల హరి కౌన్సిలర్లు డివిజన్లోని వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


