Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమన 'జూ'లు ప్రపంచస్థాయిలో నడవాలి

మన ‘జూ’లు ప్రపంచస్థాయిలో నడవాలి

- Advertisement -

– జంతువుల పరిరక్షణకి ప్రత్యేక చర్యలు అవసరం : జపాట్‌ 14వ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రపంచ స్థాయి విధానాలతో రాష్ట్రంలోని జూపార్కులను నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జూ పార్కుల్లో జంతువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. అన్ని జూ పార్కులు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను మెరుగైర సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. జూలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తారన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జూస్‌ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (జపాట్‌) 14వ గవర్నింగ్‌ బాడీ సమావేశం జరిగింది. అందులో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌), చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ఏలుసింగ్‌ మేరు, సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్‌, రామలింగం, జూ పార్క్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ ఎస్‌. హేరామత్‌, డీఎఫ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. సందర్శకుల అభిరుచుల మేరకు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, అటవీశాఖకు ఆదాయం సమకూరే విధంగా పకడ్బందీ ప్రణాళికలతో జపాట్‌ పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని నెహ్రూ, కాకతీయ, పిల్లలమర్రి, లోయర్‌ మానేరు, కిన్నెరసాని పార్కుల్లో జంతు సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌, మృగవని, మహవీర్‌ హరిణ వసన్థలి, ఇతర అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో సందర్శకుల సంఖ్య పెరిగినట్టు అధికారులు మంత్రికి వివరించారు. అదనపు సౌకర్యాలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. జూ పార్కుల నిర్వహణ బడ్జెట్‌ అనుమతులను మంత్రి నుంచి అధికారులు తీసుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad