Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంమాది సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌

మాది సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌

- Advertisement -

రీఫార్మ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌లతో ముందుకు
సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయం కాదు : మీడియాతో ప్రధాని మోడీ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మా ప్రభుత్వం రీఫార్మ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌లతో దూసుకెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం దేశం రీఫార్మ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముందుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని అన్నారు. ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణమని చెప్పారు. ఇక యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ఒప్పందం నుంచి దేశ పారిశ్రామిక వర్గాలు లబ్దిపొందాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులను ఈయూ దేశాలకు అందించాలని సూచించారు. అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా దేశం దూసుకెళ్తోందని అన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం ఎంపీలు కృషి చేయాలని చెప్పారు.

దేశాభివృద్ధే లక్ష్యం..
దేశాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రజల అభివృద్ధి సౌభాగ్యాలే లక్ష్యంగా పథకాలు, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గురువారంలో పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఆధునిక సాంకేతికతలో మార్పులకనుగుణంగా తామూ మారతామని అన్నారు. అయితే, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయం కాదని అన్నారు. అయితే ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ సాంకేతికతను జోడించి ముందుకు సాగుతామని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -