Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్దండ కెనరా బ్యాంక్ లో నిలిచిన సేవలు..

వెల్దండ కెనరా బ్యాంక్ లో నిలిచిన సేవలు..

- Advertisement -

కరెంట్ లేక పని చేయని కంప్యూటర్లు ..
ఖాతాదారుల ఇక్కట్లు..
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడ్డారు. కరెంటు సరఫరా లేకపోవడంతో  కంప్యూటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు సేవలకు సరిపడ జనరేటర్ లేకపోవడంతో చివరికి డబ్బు కౌంటింగ్ చేయడానికి సైతం కౌంటింగ్ మిషన్ పనిచేయడం లేదు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే గోల్డ్ లోన్స్ కోసం రోజుల తరబడి బ్యాంక్ వద్ద పడిగాపులు కాయల్సి వస్తుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ సేవలకు కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -