హైదరాబాద్ ఐటిసి కాకతీయలో జరిగిన ఫంక్షన్‌లో శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ సునీల్ సేనేవి ‘కింగ్ బుద్ధ వుయ్ వాంట్ వరల్డ్ పీస్’ అనే టైటిల్ సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఇరాన్ – ఇజ్రాయిల్, ఉక్రెయిన్-రష్యాతో పాటు 50 దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ‘కింగ్ బుద్ధ వురు వాంట్ వరల్డ్ పీస్’ సత్యారెడ్డి చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. ఈ చిత్రాన్ని అమెరికాలో ప్రారంభించి థాయిలాండ్, మలేషియా, వియత్నం, కాంబోడియా, లావోస్, ఇండో నేషియా లాంటి బుద్దిస్ట్ దేశాల్లో షూటింగ్ జరుపుకోవడం హర్షనీయమని ఆయన అన్నారు.
త్వరలో తమ శ్రీలంక దేశంలో షూటింగ్ జరుపుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఇన్ని బౌద్ధ దేశాల్లో షఉటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా కింగ్ బుద్ధ నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈ మూవీలో చిత్రీకరించిన సీన్లు కొన్ని చూసానని, దర్శకుడు సత్యారెడ్డి అద్భుతంగా చిత్రీకరించారని ఆయన కొనియాడారు. ’30 సంవత్సరాల నా సినీ జీవితంలో ఈ చిత్రం ద్వారా గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచానికి అందించటంతో నా జన్మ ధన్యమవుతుంది. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకు పైగా విడుదల చేస్తాం. ప్రపంచంలో ఇంతవరకు రాని అత్యుత్తమ సాంకేతికను చిత్రానికి వాడుతున్నాం’ అని దర్శకుడు సత్యారెడ్డి చెప్పారు.
100 భాషలకు పైగా..
- Advertisement -
- Advertisement -



