అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ఈ చిత్రం యూఎస్‌ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ కాబోతుండటంతో అక్కడి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. ‘రాకాస’ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుంది.
కెమెరామెన్ అందించిన విజువల్స్, బీజీఎం గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకున్నారు. టెక్నికల్ పరంగా ఈ చిత్రానికి మంచి పేరు లభించిన సంగతి తెలిసిందే. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి మానస శర్మ రచన, దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మించారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఓ సరికొత్త యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



