Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆటలుడీజీపీని కలిసిన 'ఓవరాల్‌ ఛాంపియన్‌' విజేతలు

డీజీపీని కలిసిన ‘ఓవరాల్‌ ఛాంపియన్‌’ విజేతలు

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిల భారత పోలీస్‌ డ్యూటీ మీట్‌లో హ్యాట్రిక్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ పొందిన తెలంగాణ పోలీస్‌ ప్రతినిధులు డీజీపీ బి శివధర్‌రెడ్డిని సోమవారంనాడు డీజీపీ కార్యాలయంలో కలిశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్‌ బృందం, వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్‌ ఛాంపియన్‌’ ట్రోఫీని కైవసం చేసుకుని అద్భుతమైన హ్యాట్రిక్‌ సాధించిన విషయం విధితమే. 2023-24లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2024-25లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లోనూ విజేతగా నిలిచిన తెలంగాణ, ఇటీవల నాగ్‌పూర్‌ వేదికగా ముగిసిన డ్యూటీ మీట్‌ లో హ్యాట్రిక్‌ ఓవరాల్‌ ఛాంపియన్షిప్‌ సాధించింది. ఈ సందర్భంగా తనను కలిసిన విజేతలను, అధికారులను డీజీపీ బి. శివధర్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. సీఐడీ అడిషనల్‌ డీజీపీ చారుసిన్హా , కోచ్‌ లు డి. ప్రతాప్‌, ఎం. రామకృష్ణ , టీమ్‌ మేనేజర్‌ కె. ప్రసాద్‌ , వివిధ విభాగాల విజేతలు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -