సంచార జాతులకు పోలీసుల పునరావాసం
నవతెలంగాణ – పాలకుర్తి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం సాయంత్రం వరకు రహదారులన్నీ బంద్ అయ్యాయి. పాలకుర్తి మండలానికి ఉన్న రహదారులకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. మండలంలోని దర్దేపల్లి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పాటు వలిమిడి వద్ద గల వాగు భారీ వరదతో ప్రవహిస్తుంది. వావిలాల వద్ద కల్వర్టు వరదకు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్రమల్లెయ్యకుంటలో ఎర్రమల్లెయ్యకుంటలో నివాసం ఉంటున్న సంచార జాతులకు భారీ వర్షం ఇబ్బందులకు గురిచేసింది. ఎర్ర మల్లయ్య కుంటలో ఇబ్బందులు పడుతున్న సంచారా జాతులను పునరావాస కార్యక్రమం చేపట్టేందుకు ఎస్సై దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో పునరావాసం కల్పించారు.



