Sunday, November 9, 2025
E-PAPER
Homeకరీంనగర్పొంగి పొర్లుతున్న ఎగువ మానేరు

పొంగి పొర్లుతున్న ఎగువ మానేరు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంభీరావుపేట మండలంలోని నర్మల ఎగువ మానేరు డ్యామ్ పొంగిపొర్లుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పాల్వంచ వాగు ఉప్పొంగి డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.మంగళవారం ఉదయం నుంచి డ్యామ్ మత్తళ్లు దూకుతూ జలపాతంలా అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. డ్యామ్ పూర్తి నీటిమట్టం 32 అడుగులకు చేరగా, రెండు టీఎంసీల నీటి నిల్వతో నిండిపోయింది.

ప్రస్తుతం రెండు మత్తళ్ల నుంచి నీరు పాలధారలా దిగువనున్న మధ్య మానేరు జలాశయానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎస్సై రమాకాంత్ అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మత్తడి ప్రాంతానికి ఎవరూ రాకుండా రోడ్డుకు ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.వరద ఉధృతి నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ మానేరు నుంచి మధ్య మానేరుకు భారీగా వరద నీరు విడుదల అవుతున్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -