Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎఫ్‌ఎఫ్‌ఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా పి.భరత్‌ భూషణ్‌ ఎంపిక

ఎఫ్‌ఎఫ్‌ఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా పి.భరత్‌ భూషణ్‌ ఎంపిక

- Advertisement -

తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి.భరత్‌ భూషణ్‌ను ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశారు. సినిమాల మీద మక్కువతో 27 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్‌ చేస్తూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్‌ భూషణ్‌. అలాగే భరత్‌ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి, తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున, ఇటు ప్రభుత్వానికి వారధిగా చిత్ర పరిశ్రమలోని సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు.
కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయ పరమైన చర్యలు తీసుకుని, పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు తనని వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ కొత్త బాధ్యతని కూడా శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని భరత్‌ భూషణ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -