ముగిసిన 6వ రాష్ట్ర మహాసభలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఆల్ పెన్షనర్లు, రిటైర్డ్ పర్సన్ల సంఘం (టాప్ర) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. టాప్ర రాష్ట్ర అధ్యక్షులుగా పి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో రెండురోజులపాటు జరిగిన టాప్ర రాష్ట్ర ఆరో మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పి నారాయణరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ఈపీఎస్, సీఎంపీఎస్‌తోపాటు ఇతర పెన్షనర్లను కలుపుకుని ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమంలోకి మహిళలను ఎక్కువగా ఆహ్వానిస్తామని అన్నారు. సామాజిక బాధ్యతగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. టాప్ర ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విభజించి పాలిస్తున్నాయని విమర్శించారు. వాలిడేషన్ ఆఫ్ సీసీఏ (పెన్షన్) నిబంధనల పేరుతో దుర్మార్గమైన చట్టాలను కేంద్రం తయారు చేసిందన్నారు. వాటిని రద్దు చేసేదాకా పెన్షనర్లందరినీ కలుపుకుని ఐక్యంగా పోరాడతామని చెప్పారు. 2024 తర్వాత రిటైరైన వారి పెన్షన్ బెనిఫిట్లు చెల్లించాలంటే నెలకు రూ.700 కోట్లు సరిపోవనీ, కనీసం రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
టాప్ర రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి నారాయణరెడ్డి, పి కృష్ణమూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



