నవతెలంగాణ-హైదరాబాద్: పెట్స్(pets) అనగానే ఈరోజుల్లో ఖరీదైన కుక్కలు, పిల్లి పిల్లలు మనకు గుర్తుకు వస్తాయి. వీలెజ్ కల్చర్‌లో అయితే ముద్దుగా లేగదూడను, మేకపిల్లలను మచ్చిక చేసుకొని రైతన్నలు పోషించుకుంటారు. కానీ తమిళనాడులోని ఓ కుటుంబసభ్యులు భిన్నంగా ఉడతను మచ్చిక చేసుకొని దాని అలనపాలన చూస్తున్నారు. అంతేకాదండోయో దానికి ముద్దుగా ఓ పేరు కూడా పెట్టారు. అలా ఏలా సాధ్యమని అనుకుంటున్నారా..అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీని చదవాల్సిందే. తమిళనాడులోని తూత్తుకుడిలో దయమాతి అనే మహిళ ఇంట్లో విశాలమైన గార్డెన్ ఉండేది. అయితే అనుకోకుండా ఓరోజు వాళ్ల ఇంటి గార్డెన్‌లోకి వచ్చి ఓ ఉడత.. కొబ్బరి చెట్టు ఎక్కి.. అకస్మాత్తుగా ఆ చెట్టుపైనుంచి కిందపడిపోయి గాయపడింది. ఇది గమనించిన దయమాతి..హుటాహటిన ఆ ఉడతను చేతికిలోకి తీసుకొని ప్రాథమిక చికిత్సను అందించింది. స్పూన్‌తో రోజు ఆ ఉడతపిల్లకు పాలు తాగించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకు కోలుకున్నా ఉడత వారి ఇంటి జీవితానికి అలవాటైంది.. ఎంచెక్క వాళ్ల కుటుంబసభ్యులతో కలిసి మెలిసి ఆడుకుంటూ వాళ్ల ఫ్యామిలీ మెంబర్‌లో ఒకరిగా కలిసిపోయింది. దీంతో ఆ ఉడత కోసం ప్రత్యేకంగా ఓ చిన్ని ఇంటిని నిర్మించి..శ్రద్దగా చూసుకుంటున్నారు దయమాతి ఫ్యామిలీ. ముద్దుగా దానికి ‘పచ్చై బచ్చా ‘ అని పేరుపెట్టి పిలుచుకుంటున్నారు.
‘పచ్చై బచ్చా’ ఓ తమిళ ఫ్యామిలీ పెట్
- Advertisement -
- Advertisement -