Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన పీఎసిఎస్ చైర్మన్ దంపతులు

స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన పీఎసిఎస్ చైర్మన్ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
మెడలో శివ మాలలు వేసుకోవడం, మండలం అంటే 41 రోజులపాటు కఠిన దీక్ష పాటించడం, చల్లటి చలిలో ప్రాతః కాల స్నానమాచరించడం, రోజంతా స్వామి నామస్మరణ భక్తి పారవశ్యంలో తరించడం స్వాముల దీక్ష కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది. ఎంతో భక్తినిష్ఠలతో కొనసాగే దీక్ష స్వాములకు అన్న ప్రసాద వితరణ గావించడం పూర్వజన్మ సుకృతం, అన్ని దానాలలో అతి గొప్ప దానం. అలాంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కల్వకుర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పీఏసీఎస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ సౌజన్య దంపతులు ఏర్పాటు చేశారు.

మొదటగా వెంకటేశ్వర దేవాలయానికి విచ్చేసిన జనార్దన్ రెడ్డి దంపతులు శివునికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వామి వారికి టెంకాయలు కొట్టి హారతులు ఇచ్చారు. తదనంతరము అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన పీఏసీఎస్ చైర్మన్ జనార్దన రెడ్డి దంపతులకు గురు స్వామి ఆనంద్ గౌడ్ అధ్వర్యంలో స్వాములంతా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించినందుకు శివ స్వాములకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ,ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని,భవిష్యత్ లో స్వాములకు అండగా ఉంటామని తెలిపారు.

తన వంతు సేవగా కఠోర దీక్షను పాటించే శివ స్వాములకు ఒక్క పూటైనా అన్న ప్రసాద వితరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో గురు స్వాములు ఆంజనేయులు,కృష్ణ గౌడ్,వెంకటయ్య,బాల్ రాజు,రాజు,జంగయ్య,శివ మరియు శివ స్వాములు,హనుమాన్ స్వాములు,అయ్యప్ప స్వాములు సివిల్ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -