Thursday, November 20, 2025
E-PAPER
Homeజిల్లాలుధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పీఏసీఎస్ చైర్మన్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పీఏసీఎస్ చైర్మన్

- Advertisement -

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు : పిఎసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

దళారుల చేతిలో మోసపోవద్దు అనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. గురువారం తాడిచెర్ల, పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో తహశీల్దార్ రవికుమార్, పిఏసిఎస్ మెంబర్లుతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. కేంద్రాలలో ఇన్చార్జీలు రైతులను ఎవరిని కూడా ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు.

ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.క్వింటాల్ దాన్యానికి గ్రేడ్ ఏ రూ.2389, కామన్ ధర రూ.2369,మ్యాచర్ 17 శాతం మించరదన్నారు. టోకెన్ తీసుకున్న  రైతులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు,మోబైల్ అనుసంధానం చేసుకొని ఓటిపి ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని ఏఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్లు మల్కా ప్రకాష్ రావు,వొన్న తిరుపతి రావు, మెరుగు రాజయ్య,మంథని మార్కెట్ డైరెక్టర్ పన్నాల ఓదెలు,కాంగ్రెస్ పార్టీ పెద్దతూండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్ల రవిందర్, నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,రాజు నాయక్,చెంద్రయ్య,రాహుల్,కిషన్ నాయక్,మధు,పిఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -