నవతెలంగాణ – కంఠేశ్వర్
వినాయక చవితి సంధర్భంగా కేసీఆర్ కాలనీ లోని సాయి హనుమాన్ ఆలయం వద్ద డా.పడకంటి రాము తన కుమారుడు ఆదిత్య, రాము మిత్రులు సూపర్ మార్కెట్ వంగపల్లి చంద్రమౌళి, వివేకానంద రెడ్డి లతో కలిసి వేయి మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మొదటి నుంచి చివరి వర కు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకులు రాంకిషన్ రావు కూడా పాల్గొని రాము సేవాకార్యక్రమాల్ని అభినందించారు. కేసీఆర్ కాలనీలో నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువ మట్టి విగ్రహాలు ఉచితంగా పంచే బృహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు డా. పడకంటి రాముకు కార్యక్రమంలో పాల్గొన్నవారంతా కృతజ్ఞతలు తెలిపారు.నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు విచ్చేసి భక్తి శ్రద్ధలతో మట్టి గణపతుల్ని తీసుకెళ్లారు.ఈ సందర్భంగా డా. పడకంటి రాము మాట్లాడుతూ.. మట్టి గణపతుల్ని పంచే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నానని ఇది తాను జీవితాంతం కొనసాగిస్తానని మీడియాకు తెలియచేసారు.
మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేసిన పడకండి రాము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES