పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం లాంఛనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ప్రారంభించారు. రైతులకు మరింత సౌలభ్యం, పూర్తి పారదర్శకతతో ధాన్యం కొనుగోళ్లు సాగించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రొండి రాజు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా అవకతవకలకు తావు ఇవ్వకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఎం ఎస్ పి అందేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ త్వరలోనే అందజేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ ఎంఆర్‌ఓ, వ్యవసాయాధికారి వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకుళభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, జిల్లా డీసీసీ సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఆదిల్ పాషా, బొల్లారం మాజీ సర్పంచ్ ఇరువాల మల్లేశం, మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కైలాసం, దశరథం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.



