Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

- Advertisement -

– ఏపిఎం జగదీష్ కుమార్

నవతెలంగాణ మద్నూర్ 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశనుసారముగా ఖరీఫ్ ( 2025-26) సీజన్ లో భాగంగా డోంగ్లి మండలం లోని కుర్లా, ఎంబుర, మదన్ హిప్పర్గ,  మద్నూర్ మండలం లోని సుల్తాన్ పేట్,  గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం 2389 రూపాయలు, కామన్ రకం 2369  ఉంటుందని తెలిపారు.

వరి ధాన్యం రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐకెపి ఆధ్వర్యంలో జరిగిన కొనుగోళ్ల కేంద్రాల ప్రారంభోత్సవంలో కుర్లా గ్రామ సంఘం అధ్యక్షురాలు జ్యోతి ,  సీసీలు బాబాన్ సింగ్, అనిల్, అకౌంటెంట్ నర్సింగ్ రెడ్డి, వివో ఏ  సుభాష్, ఆయా గ్రామాల రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -