Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరిధాన్యం కొనుగోళ్లు త్వరలోనే ప్రారంభిస్తాం: కలెక్టర్

వరిధాన్యం కొనుగోళ్లు త్వరలోనే ప్రారంభిస్తాం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించి ఒకటి రెండు రోజులలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని ఎదుల్లగూడెం, మందాపురం, నాతాళ్ళగూడెం, రెడ్లరేపాక గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భముగా రైతులతో అధికారులతో మాట్లాడుతూ.. మండలంలో పూర్తి స్థాయిలో ఒకటి రెండు రోజులలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని, ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు మ్యాచర్ 17% వచ్చేటట్లు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు. కొనుగోళ్లు కేంద్రాలలో రైతులకు నిలువ నీడ లేకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, వారికి కనీసం టెంట్, మంచినీటి వసతి కల్పించాలని, ధాన్యం నాణ్యతగా ఆరబెట్టి ప్రభుత్వ మద్దతు ధరపొందాలని రైతులకు సూచించారు.

రైతులు ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తొందరగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని అన్నారు. నాణ్యతగా ఆరపెట్టిన ధాన్యాన్ని మ్యాచర్ 17% వస్తె వెంటనే తుకాలు వేసి లారీలు సమకూర్చి మిల్లులకు రవాణా చేయాలని, లారీలలో ఎగుమతి చేసిన ధాన్యాన్ని ట్యాబ్లో నమోదు చేది రైతులకు తక్ చిట్టీల అందజేయాలని అన్నారు. గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ భూమి ఉన్న చోట కొనుగోలు కేంద్రాలకు కేటాయిస్తామని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు విశ్రాంత కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అనుమతులు రాగానే నిర్మాణాలు చేపడతామని అన్నారు. మాందాపురంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం  రెడ్లరేపాకలోని ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించి రోగులకు సరిపడ మందులు నిల్వ ఉంచుకోవాలని, కాలం చెల్లిన మందులను ఇవ్వకూడని వైద్య సిబ్బందికి సూచించారు.

మండలకేంద్రంలో శ్రీ  వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత  పాఠశాలలోనీ  మధ్యాహ్న భోజనాలను పరిశీలించి విద్యార్థులకు ప్రకారం  నాణ్యమైన భోజనం పంపిణీ చేయాలని సూచించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గ్రామ పరిపాలన అధికారులకు భూభారతిలో నూతనంగా ప్రవేశ పెట్టిన సాదాబైనామల పై, రైతులకు భూసమస్యలపై, బర్త్ సర్ఫికెట్లపై, మరణ ధృవీకరణ సర్టిఫికెట్ల పంపిణీ పై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి పకడ్బందీగా పంపిణీ చేయాలని  తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జలంధర్ రెడ్డి, తహశీల్దార్ దశరథ, డిప్యూటీ తహశీల్దార్  పల్లవి, మండల వ్యవసాయ అధికారి అంజనీదేవి,  హౌసింగ్ ఏ ఈ కిరణ్ , ఏ పి ఎం అంజయ్య,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,  సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -