- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
రైతులు తమ వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలతో వరి కొనుగోలు కేంద్రంలో విక్రయించి లబ్ధి పొందాలని ఏ ఈ ఓ రాకేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులనుదేశించి మాట్లాడుతూ…. తుపాన్ నేపథ్యంలో రైతులు తమ వరి ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరి కోతలు చేపట్టకూడదని, సాధారణ వాతావరణం నెలకొన్న తర్వాతనే వరి కోతలు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



