నవతెలంగాణ – చంపాపేట్ : సీపీఐ ఐఎస్ సదన్ డివిజన్ కార్యదర్శి షేక్ మహమూద్ ఆధ్వర్యంలో పహిల్గాంలో జరిగిన మారణహోమం లష్కరే తోయిబా ముష్కరులు అమాయక భారత టూరిస్టులు 28 మంది చనిపోయారు. ఈ ముష్కరులను ఉరిశిక్ష వేయాలని అదేవిధంగా భారత ప్రభుత్వం భద్రత బలగాలను పెంచాలని కోరుతూ ఈరోజు సింగరేణి కాలనీలో క్యాండిల్ ప్రదర్శన చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అమీనా, అంజయ్య, రాజు నాయక్, నర్సింగ్ రావు, వెంకటేష్ అజయ్, అజీం, సల్మాన్, జమీర్, సుజాత, హన్మంతు, రేష్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -