- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ చౌక్ నందు పట్టణంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందున మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జూరాల గ్రామం నుండి కృష్ణా నదిపై కొత్తపల్లి వరకు బ్రిడ్జి నిర్మాణం శంకుస్థాపన జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, మండల అధ్యక్షులు పరమేష్, నియోజకవర్గం నాయకులు తులసిరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -