Sunday, May 11, 2025
Homeజాతీయంఎయిర్‌ స్పేస్‌ మూసేసిన పాకిస్తాన్‌..

ఎయిర్‌ స్పేస్‌ మూసేసిన పాకిస్తాన్‌..

- Advertisement -

రావల్పిండి : శుక్రవారం సాయంత్రం కాశ్మీర్లోని ఎల్‌ఓసీ వెంట 26 ప్రాంతాల్లో పాక్‌ భారీగా డ్రోన్‌ దాడులకు పాల్పడింది. ఈ దాడులను ధీటుగా తిప్పి కొట్టిన భారత్‌.. పాకిస్థాన్‌లోని ముఖ్యమైన మూడు ఎయిర్‌ బేస్‌ల మీద బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకు పడింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌, మురిద్‌, రఫీఖీ వైమానిక స్థావరాలపై భారత్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ తన గగనతలాన్ని మూసేసింది. ”నోటమ్‌” జారీ చేసింది. మద్యాహ్నం 12 గంటల వరకు దేశ, విదేశ విమానాలకు ఎయిర్‌ స్పేస్‌ క్లోజ్‌ చేసింది. అబుదాబి నుంచి పెషావర్‌ వెళ్తున్న పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని క్వెట్టాకు మళ్లించినట్టు తెలుస్తోంది. భారత్‌ చేసిన దాడుల్లో ఎయిర్‌ బేస్‌లోటని అన్ని సౌకర్యాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాక్‌ ఫైటర్‌ జెట్స్‌ ఎగరకుండా చేసినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -