Sunday, February 8, 2026
E-PAPER
Homeఆటలుపాకిస్తాన్‌ బోణీ

పాకిస్తాన్‌ బోణీ

- Advertisement -

నెదర్లాండ్స్‌పై 3 వికెట్లతో విజయం

కొలంబో : 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పైచేయి సాధించింది. శనివారం కొలంబోలో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాక్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరు ఓవర్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గట్టి పోటీనిచ్చింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 7 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. షాహిబ్జాద ఫర్హాన్‌ (47), సయీం ఆయుబ్‌ (24), ఫహీమ్‌ అష్రాఫ్‌ (29 నాటౌట్‌) రాణించారు. 100/5తో పాకిస్తాన్‌ ఒత్తిడిలో కూరుకున్నా.. ఫహీమ్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో పాక్‌ను గట్టెక్కించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (37), బస్‌ డి లీడె (30), కొలిన్‌ ఆకర్‌మాన్‌ (20), మైకల్‌ లెవిట్‌ (24) రాణించారు. పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా (3/24), మహ్మద్‌ నవాజ్‌ (2/38), అబ్రార్‌ అహ్మద్‌ (2/23), ఆయుబ్‌ (2/7) వికెట్లు పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -