Monday, March 23, 2026
E-PAPER
Homeఆటలుపాక్‌ క్రికెటర్లపై జరిమానా

పాక్‌ క్రికెటర్లపై జరిమానా

- Advertisement -

చెత్త ప్రదర్శనకు పీసీబీ నిర్ణయం

కరాచీ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్‌ సూపర్‌8 దశ నుంచే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ దశలో భారత్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌.. సూపర్‌8 దశలో తేలిపోయింది. సెమీఫైనల్‌కు చేరటంలో విఫలమైన పాకిస్తాన్‌ క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) భారీ జరిమానా విధించింది. జట్టులోని ప్రతి ఆటగాడిపై రూ.16.50 లక్షలు (పాక్‌ కరెన్సీలో 50 లక్షలు) జరిమానా విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకోనందుకు క్రికెటర్లపై జరిమానా విధించటం పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే ప్రథమం. పాక్‌ ఓపెనర్‌ ఫర్హాన్‌ 383 పరుగులతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పినా.. సహచర క్రికెటర్లతో పాటు ఫర్హాన్‌ సైతం జరిమానా చెల్లించాల్సిందేనని పీసీబీ హుకుం జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -