- Advertisement -
నవతెలంగాణ – న్యూఢిల్లీ: భారత వైమానిక దళం, భారత సరిహద్దు భద్రతా దళం.. దేశ రక్షణలో ఎంతో కీలకమైన ఈ రెండు వ్యవస్థల సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్కు చేరవేస్తున్న గుజరాత్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన సహదేవ్ సింగ్ గోహిల్ అని, అతను హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాడని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్వాడ్ సీనియర్ అధికారి కె సిద్ధార్థ్ మీడియాకు తెలిపారు.
- Advertisement -