Thursday, May 29, 2025
Homeజాతీయంన్యూక్లియర్‌ ఆధునీకరణపై పాక్‌ దృష్టి

న్యూక్లియర్‌ ఆధునీకరణపై పాక్‌ దృష్టి

- Advertisement -

– చిన్నపాటి అణ్వాయుధాలను సమకూర్చుకునే యత్నాలు : అమెరికా నివేదిక
న్యూఢిల్లీ:
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు డ్రోన్ల ప్రయోగిం చుకున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌పై భారత్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిం చిందని భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో న్యూక్లియర్‌ ఆధునీకరణపై పాకిస్తాన్‌ దృష్టి పెట్టినట్టు సమాచారం. అలాగే, భారత్‌లో దేశీయంగా తయారైన ఆయుధ సంపత్తికి పోటీనిచ్చేలా పాక్‌ తయారవుతున్నట్టు తెలుస్తున్నది. భారత్‌ స్థానికంగా అభివృద్ధి చేసిన (దేశీ) అణ్వాయుధాలకు ప్రతిస్పందనగా పాక్‌ చిన్నపాటి వ్యూహాత్మక అణ్వాయుధా లను అభివృద్ధి చేయటం లేదా సంపాదించటానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని యూఎస్‌ నివేదిక ఒకటి వివరించింది. భారత్‌ దేశీయంగా పలు అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నదని పేర్కొన్నది. గతేడాది అగ్ని-1 ప్రైమ్‌ ఎంఆర్‌బీఎం, అగ్ని-5 పరీక్షలను జరిపిందని గుర్తు చేసింది. భారత్‌తో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో న్యూక్లియర్‌ ఆధునీకరణకు పాకిస్తాన్‌ వేగవంతం చేస్తున్నదని సదరు నివేదిక వివరించింది. ఇందులో భాగంగా అణ్వాయుధాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నది. ఇతర దేశాల నుంచి పలు విధ్వంసక ఆయుధాలను సమకూర్చుకోవటానికి సిద్ధమవుతున్నట్టు వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -