రైతుల పండించిన ధాన్యం నిలువలకు గోదాములను ఏర్పాటు చేస్తా
గోదాముల నిర్మాణానికి నిధులు కేటాయించాలి
వేర్ హౌస్ కార్పోరేషన్ ఎండి ని కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
ఆదర్శ నియోజకవర్గంగా పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా ఉండే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదులో గల వేర్ హౌస్ కార్పొరేషన్ ఎండి కొర్ర లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, నియోజకవర్గంలో గోదాముల నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల మండల కేంద్రంలో 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతన గోదామును ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరామని తెలిపారు. రైతులు పండించిన పంటలను నిలువ చేసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. నియోజకవర్గంలోని రైతాంగానికి గోదాములు అత్యవసరమని తెలిపారు. వేర్ హౌస్ కార్పొరేషన్ ఎండి లక్ష్మి స్పందించారని గోదాముల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
ఆదర్శ నియోజకవర్గంగా పాలకుర్తిని అభివృద్ది చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES