– అండర్ 19 మహిళల వన్డే క్రికెట్ జట్టులో ఎంపిక
– అనేక రంగాల్లో మెరిసిన గంగారం వాసి
నవతెలంగాణ – కాటారం
గ్రామీణ ప్రాంతంలో జన్మించిన శ్లోక పాల్గుణ రెడ్డి జాతీయస్థాయి అండర్ 19 మహిళల వన్డే క్రికెట్ జట్టులో ఆడెందుకు ఎంపికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన బొమ్మన జైపాల్ రెడ్డి రాజేశ్వరి కావ్య దంపతుల పుత్రిక శ్లోక పాల్గుణ రెడ్డి క్రికెట్ తో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ బహుముఖ ప్రతిభను కనబరుస్తుంది. హెచ్ సీ ఏ తెలంగాణ తరపున బీసీసీఐ తెలంగాణ అండర్-19 మహిళల వన్డే క్రికెట్ జట్టుకు ఎంపికైంది. అలాగే జాతీయ అండర్-14లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీఎస్ఐ ఎస్ జీ ఆఫ్ ఐ భారత జట్టులో స్థానం సంపాదించింది. క్రికెట్ కాకుండా త్రోబాల్, అబాకస్, కూచిపూడి- వివిధ రంగాల్లో రాణించిన బహుముఖను పోషిస్తుంది.
దుబాయిలో కూచిపూడి నాట్యం చేయగా నాట్య మయూరి ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డా. తమిళిపై సౌందరరాజన్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకుంది. నిరంతరం తన ప్రతిభను వివిధ రంగాల్లో ప్రదర్శనలను ఇస్తుండగా డిసెంబర్ 13 న లక్నోలో లక్నోలో ప్రారంభమవుతున్న బీసీసీఐ అండర్-19 మహిళల వన్డే టోర్న మెంట్ కు ఎచ్ సీ ఏ తెలంగాణ తరపున ఎంపిక కావడం, శ్లోక కృషికి వచ్చిన మరో గొప్ప అవకాశం అని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
జాతీయ స్థాయిలో ఫాల్గుణ రెడ్డి ఎదుగుదల ప్రారంభమైనది అండర్- 14 వయో విభాగంలోనే. లక్నోలో జరిగిన టోర్నమెంట్ లో మహారాష్ట్రపై కీలక వికెట్లు తీసి ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర జట్టు విజయంలో ఆమె అందించిన సహకారం విశేషంగా నిలిచింది. ఆ మ్యాచ్లో ఆమె చూపిన ప్రదర్శన కారణంగానే సీఐసీఎస్ఈ బోర్డు నిర్వహించిన. ఎంపికలో శ్లోకకు భారత అండర్-14 జట్టులో స్థానం లభించింది.
అబాకస్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి గణన సామర్థ్యాన్ని రుజువు చేసి కళారంగంలోనూ ఆమె ప్రత్యేక గుర్తింపు పొంది కూచిపూడి నర్తకిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే నైపుణ్యానికి గుర్తింపుగా ఆమెకు నాట్య మయూరి ఇంటర్నేషనల్ అవార్డు లభించింది.అలాగే వ్యక్తిత్యం ప్రజెంటేషన్, వేదికపై ప్రవర్తన వంటి అంశాల్లో పత్తా చాటిన పాల్గుణ కు 2024లో మిస్ హైదరాబాద్ బిరుదు లభించడం శ్లోక బహుముఖతను స్పష్టంగా తెలియజేస్తోంది. శ్లోక ఫాల్గుణ రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులోని జాన్సన్ గ్రామర్ స్కూల్ ఐసీఎస్ సీ లో 11వ తరగతి చదువుతోంది. తండ్రి జైపాల్ రెడ్డి అర్కి టెక్స్ట్, తల్లి రాజేశ్వరి కావ్య హెచ్.ఆర్. కన్సల్టెంట్గా పనిచేస్తూ, కూతురు ప్రతిభ వికాసానికి దృఢమైన మద్దతుగా నిలుస్తున్నారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే అన్ని రంగాల్లో రాణిస్తున్నాను
ఈ సందర్భంగా శ్లోక తన లక్ష్యాల గురించి మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతొనే ఉన్నతమైన అవకాశాల కోసం శ్రమిస్తున్నానని ఫాల్గుణ రెడ్డి తెలిపింది.



