Tuesday, May 6, 2025
Homeట్రెండింగ్ న్యూస్మండు వేసవిలో తాటి ముంజలు ఎంతో మేలు 

మండు వేసవిలో తాటి ముంజలు ఎంతో మేలు 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 

తాటి ముంజలు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో అధికంగా తేమ,తక్కువ కొవ్వు తక్కువదార్థాలు ఉంటాయి. ఇది వేసవి తాపానికి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, శక్తిని ఇస్తుంది. తాటి ముంజలు వేసవి తాపానికి ఉపశమనం కలిగించి, వేడిని తగ్గించి చల్లబరుస్తాయి. ఇందులో ఉన్న నీరు, కార్బోహైడ్రేట్లు ఫ్రూటీలు శరీరానికి వెంటనే శక్తినిస్తాయి. పీచు పదార్థాలు జీర్ణక్రియ మెరుగు పరుస్తాయి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ముంజలలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ముంజలు చాలా మంచి. తాటి ముంజలు వేసవిలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కాబట్టి వేసవిలో వీలైనంతవరకు ముంజలు తినడం మంచిది. వేసవి తాపం నుంచి ఉపషమనానికి వినియోగదారులు తాటి ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -