– పెరిగిన గెలలు దిగుబడి
– గెలలు ధర పెరిగే అవకాశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
గతంలో ఎన్నడూ పెరగని విధంగా ఈ నెల గెలలు దిగుబడి కనిపిస్తుంది.రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పామాయిల్ సాగు విస్తరించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముదురు తోటలు,ఇతర జిల్లాల్లోని లేత తోటలు నుండి గెలలు రావడంతో ఆగస్ట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా గెలలు దిగుబడి పెరిగింది.ఆదివారం ఈ వార్త రాసే సమయానికి రేండు పరిశ్రమల పరిధిలో మొత్తం 47,632.235 మెట్రిక్ టన్నుల గెలలు పరిశ్రమలకు చేరినట్లు అశ్వారావుపేట,అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్ లు నాగబాబు,కళ్యాణ్ గౌడ్ లు తెలిపారు. గత నెల జులై లో 38341.100 మెట్రిక్ టన్నులు గెలలు రాగా ఈ ఆగస్ట్ లో జులై కంటే అదనంగా 9,291.135 మెట్రిక్ టన్నుల గెలలు తో మొత్తం 47,632.235 మెట్రిక్ టన్నుల గెలలు పరిశ్రమలకు చేరి గత రికార్డ్ ను అధిగమించాలి. 2024 ఆగస్ట్ 35,810 మెట్రిక్ టన్నుల గెలలు మాత్రమే వచ్చాయి. నవంబర్ నుండి అక్టోబరు వరకు ఆయిల్ ఇయర్ ఆయిల్ ఫెడ్ పరిగణిస్తుంది.దీంతో ఈ ఆయిల్ ఇయర్ లో ఆగస్ట్ లో అధికంగా వచ్చిన గెలలు రికార్డ్ ను సృష్టించాయి. గెలలు పెరిగితే ముడి నూనె దిగుమతి పెరిగే అవకాశం ఉన్నందున ఆగస్ట్ గెలలు ధర పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. జులై లో టన్నుల గెలలకు ధర రూ.18052 లు ధర చెల్లిస్తున్నారు.ఆగస్ట్ నెలకు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
పామాయిల్ గెలలు
- Advertisement -
- Advertisement -