– పామాయిల్ మెట్రిక్ టన్ను గెలల రూ.19107 లు
– ఆగస్ట్ లో టన్ను కు రూ.1055 లు పెరుగుదల
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆగస్ట్ నెలకు మెట్రిక్ టన్ను పామాయిల్ గెలల ధరను రూ.19,107 లుగా ఆయిల్ ఫెడ్ అధికారులు సెప్టెంబర్ 1 వ తేదీ సోమవారం ఖరారు చేసారు.జులై నెల టన్ను గెలలు ధర రూ.18052 లు ఉండగా ఆగస్ట్ లో టన్ను కి రూ.1055 లు పెరుగుదల కనిపిస్తుంది.ఈ ఏడాది గడిచిన జనవరి, ఫిబ్రవరి, మార్చి,ఏప్రిల్ ఈ నాలుగు నెలలు టన్ను గెలలు ధర రూ.20 వేలు పైగానే పలుకగా మే,జూన్,జులై నెలలు ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఆగస్టులో టన్నుకు ఏకబిగిన రూ.1055 లు పెరగడం విశేషం.
నెల ధర పామాయిల్ గెలలు
వ్యత్యాసం
జనవరి 20487
ఫిబ్రవరి 20871 + 384
మార్చి 21000 + 129
ఏప్రిల్ 20058 – 942
మే 18748 – 1310
జూన్ 17463 – 1285
జులై 18052 + 588
ఆగస్ట్ 19107 + 1055
ఈ ఏడాది (2025) లో గెలలు ధరలు జనవరి, ఫిబ్రవరి, మార్చి ల్లో స్వల్పంగా పెరిగి ఏప్రిల్, మే, జూన్ ల్లో తగ్గి, జులై, ఆగస్టుల్లో పెరుగుదల కనిపిస్తుంది.