Friday, July 11, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో పామాయిల్ ప్లాంటేషన్

అశ్వారావుపేటలో పామాయిల్ ప్లాంటేషన్

- Advertisement -

26 ఎకరాల సాగుకు ప్రారంభం: హెచ్.ఓ వేణుమాధవ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పామాయిల్ ప్లాంటేషన్ మెగా డ్రైవ్ లో భాగంగా అశ్వారావుపేట మండలంలోనూ 26 ఎకరాల్లో సాగు ప్రారంభించినట్లు ఉద్యాన అధికారి వేణుమాధవ్ తెలిపారు. మండలంలోని వేదాంత పురం పంచాయితీ తిమ్మంపేటలో, అనంతారం పంచాయితీ నెమలి పేటలో గురువారం ఆయన ప్లాంటేషన్ లో పాల్గొన్నారు. మండలంలో మొత్తం 20 మంది రైతులకు 96.79 ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేయనున్నారని తెలిపారు. పామాయిల్ సాగుతో నికరాదాయం మే కాకుండా అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకులు యశస్వి మల్లారెడ్డి,పలువురు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -