Monday, February 2, 2026
E-PAPER
Homeఖమ్మంజనవరిలో పామాయిల్ గెలలు ధర పెంపు

జనవరిలో పామాయిల్ గెలలు ధర పెంపు

- Advertisement -

– టన్నుకు రూ.762 పెరిగిన ధర
– రైతుల్లో చిగురించిన ఆశలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

జనవరి నెలకు రైతులకు చెల్లించాల్సిన ఎఫ్.ఎఫ్.బీ(ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) తాజా పామాయిల్ గెలలు ధరను ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు సోమవారం ప్రకటించారు. 2025 డిసెంబర్ లో మెట్రిక్ టన్ను గెలలు ధర రూ.19,694గా ఉండగా,2026 జనవరి నెలకు రూ.20,456గా నిర్ణయించారు. దీంతో టన్నుకు రూ.762 పెరుగుదల నమోదైంది. అయితే 2025 జనవరిలో మెట్రిక్ టన్ను ధర రూ.20,487గా ఉండగా, 2026 జనవరిలో రూ.20,456 గా ఖరారు కావడం గమనార్హం.  ఈ లెక్కన ఈ ఏడాది పామాయిల్ గెలలు ధర రైతులకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్ ఫెడ్ విధానం ప్రకారం నవంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఆయిల్ ఇయర్‌ గా పాటిస్తారు. ఆయిల్ ఇయర్‌లో ఇప్పటివరకు ప్రకటించిన ధరలు ఇవీ:

నెల                 మెట్రిక్ టన్ను ధర (రూ. వేలల్లో)

నవంబర్ 2025                          19,598

డిసెంబర్ 2025                          19,694

జనవరి 2026                            20,456

ఈ ఆయిల్ ఇయర్ అంతటా ఇదే ధరలు ధోరణి కొనసాగితే, పామాయిల్ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు మెరుగుపడతాయని వ్యవసాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -