– సెప్టెంబర్ టన్ను గెలలు ధర రూ.19400
– అక్టోబర్ గెలలు ధర రూ.19681
– టన్ను కు రూ 281 లు పెరుగుదల
– ఈ ఆయిల్ ఇయర్ లో టన్ను సరాసరి రూ.19649
నవతెలంగాణ – అశ్వారావుపేట: అక్టోబర్ పామాయిల్ గెలలు ధరను శనివారం ఆయిల్ ఫెడ్ ప్రకటించింది.టన్ను పామాయిల్ గెలలు ధరను రూ.19681 లు నిర్ణయించింది. సెప్టెంబర్ లో టన్ను గెలలు ధర రూ.19400 లు ఉండగా అక్టోబర్ కు టన్ను కు రూ.281 లు పెంచింది. ఆయిల్ ఇయర్ అంటే నవంబర్ 1 తేదీ నుండి అక్టోబర్ 31 వ తేది వరకు పరిగణిస్తారు.ఈ ఆయిల్ ఇయర్ లో ప్రతీ నెలా మెరుగైన ధర లే పలికాయి.ఇక్కడ 2024 నవంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 31 వరకు నెల వారీ ధరలు పొందుపరుస్తున్నాను.
నెల ధర
నవంబర్ 20413
డిసెంబర్ 20506
జనవరి 20487
ఫిబ్రవరి 20871
మార్చి 21000
ఏప్రియల్ 20058
మే 18748
జూన్ 17463
జులై 18052
ఆగస్ట్ 19107
సెప్టెంబర్ 19400
అక్టోబర్ 19681
సరాసరి టన్ను గెలలు ధర 19649
పెరిగిన కూలీలు వేతనాలు,డీజిల్ ధరలు,సాగు వ్యయం రీత్యా రైతు టన్ను గెలలు మద్దతు ధర రూ.25 వేలు ఉండాలని కోరుకుంటున్నారు.



