Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్ఉత్సవ కమిటీ సభ్యులుగా పల్నాటి సత్యం 

ఉత్సవ కమిటీ సభ్యులుగా పల్నాటి సత్యం 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా మంగపేట్ మండలం మల్లూరు హేమచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల, ఉత్సవ కమిటీ సభ్యులుగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, తాడ్వాయి మండలం కాటాపూర్(బీరెల్లి) గ్రామానికి చెందిన పల్నాటి సత్యంను, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నియమించినట్లు ఆలయ ఈవో శ్రవణం సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుండి 17 వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ సభ్యునిగా నియామకం చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు గ్రామాల నుండి వచ్చే భక్తులు వీరి సేవలు వినియోగించుకోవాలని కోరారు. కాగా ఆయన నియమాకానికి సహకరించిన మంత్రి సీతక్కకు, ప్రభుత్వ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -