Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బనకచర్ల జల దోపిడీని అడ్డుకోవాలని కరపత్రల ఆవిష్కరణ

బనకచర్ల జల దోపిడీని అడ్డుకోవాలని కరపత్రల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని  జాగృతి&నవ భరత్ కళాశాలలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమంగా గోదావరి జలాలను బనకచర్ల కు తరలించుకుపోతున్న విషయాన్ని విద్యార్థులకు  కరపత్రాలు పంపిణి చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒగ్గు శివ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నదే నీళ్ళు,నిధులు,నియామకాలు అనే నినాదం మీదనే తెలంగాణ ఉద్యమం జరిగిందని సాదించుకున్న రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేశారని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రానికి  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి పరిస్థితులను తీసుకోచ్చారని చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడే విధంగా గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాలంటే విద్యార్దులు అందరూ చైతన్యం అయి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి సిద్ధం కావాలని విద్యార్దులకు పిలుపుని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కోఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్ రెడ్డి,  భువనగిరి మండల అధ్యక్షులు కనకాల  మహేష్, నియోజవర్గ ఉపాధ్యక్షులు ఎండి మున్నా,  ఏర్పుల అరవింద్, భువనగిరి మండలం యూత్ అధ్యక్షుడు ముల్లె నాగేంద్రబాబు,  బీబీనగర్ మండల అధ్యక్షులు పచ్చిమట్ల వంశీ గౌడ్, రాసాల రమేష్ యాదవ్, పల్లెపాటి నరసింహ, కొంగల వంశీ, రమేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -