Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజోలి మండలంలో కరపత్రాలు విడుదల

రాజోలి మండలంలో కరపత్రాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి : రాజోలి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ సెంటర్లో ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ఆశ వర్కర్ల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమ్మెకు కేవీపీఎస్ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కెవిపిఎస్ మండల కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడలు తెచ్చిందని వాటిని రద్దు చేసేదాకా పోరాటం ఆగదని ఆశ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా డ్యూటీ చేస్తున్న అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాపై అదనపు భారం తగ్గించాలని ఆశా కార్యకర్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, పద్మ, రేణుక, విజయలక్ష్మి, సిఐటియు నాయకులు నర్సింహులు, కోటి, నాగప్ప పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -