నవతెలంగాణ – కంఠేశ్వర్ : పల్లె పల్లెకు కరపత్రం చేరే విధంగా నిజామాబాద్ బస్టాండ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బస్సు బస్సుకి కరపత్రాలను పి ఓ డబ్ల్యు కార్యదర్శి సంధ్య ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపికలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని నిరంతరం కరపత్రాలు ప్రచారం నిరసనలు రేపటినుండి పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు. ఈ పోటీల వల్ల బిజినెస్ చేసుకునే వారికి ఉపయోగపడతాయి తప్ప ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగాలు లేవని అన్నారు. ఈ పోటీల వల్ల మహిళల్ని కించపరిచినట్టుగా ఉంటాయి తప్ప ప్రయోజనాలు లేవు కాబట్టి రద్దు చేయమని మహిళా సంఘలుగా కోరుతున్నాం. లేదంటే రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చి ఆపేంతవరకు పోరాటాలు నిర్వహిస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు అధ్యక్షురాలు గోదావరి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్, నాయకులు రాజు, పిడిఎస్ యు మైపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపల్లెకు కరపత్రాలు అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES