రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి, చంద్రశేఖర్ తివారీ హాజరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని బీజేపీ పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించింది. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని వినినేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి చంద్రశేఖర్ తివారీ ప్రజలకు ఉగాధి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం సుఖశాంతులను, అభివృద్ధిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
రానున్న రోజుల్లో ప్రపంచం సాంకేతిక రంగంలో వేగంగా దూసుకుపోతోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని కోరారు. దేశంలో గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో కూడిన భారీ నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయని తెలిపారు. వివిధ పోర్టుల ద్వారా ఇప్పటికే గ్యాస్ సరఫరా సెంటర్లకు చేరిందని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రావణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



