డిసెంబర్ 17న పోలింగ్
నవతెలంగాణ – ముధోల్
మూడవ విడత ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. అయితే ప్రచారం పర్వం సోమవారం సాయంత్రం ముగియడంతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నరు. చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలు 17వ తేదీన జరుగనున్న నేపథ్యంలో గెలుపు కోసం అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునుందుకు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. గెలిపే ద్యేయంగా అభ్యర్థులు పోటాపోటీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా కుల సంఘాలకు, మహిళా సంఘాల సభ్యులకు ,యూత్ సభ్యులకు కలిసి ఒక్క సారి తమకు అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రాధాయపడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాలలో ప్రధానంగా యువతపై దృష్టి సారించారు . ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న ఆలోచనతో సర్పంచ్ అభ్యర్థులు ఎత్తుగడలేస్తున్నారు.మండలంలోని 19 గ్రామపంచాయితి లలో 2సర్పంచ్ స్థానా లు 53 వార్డులు ఏకగ్రీవం కాగ మండలంలో 17 సర్పంచ్, 113 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకుఅధికారులు ఏర్పాటు చేస్తున్నారు.



